W.G: ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. ఆదివారం పెదఅమిరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ, జేసీ, డీఆర్ఎ, ఆర్డీవోలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.