ASR: జీకేవీధి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ తహసీల్దార్ అన్నాజీరావు పర్యటించారు. మండలంలోని వరద ముంపు ప్రాంతాలైన చట్రాపల్లి, తోకరాయి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల గ్రామస్థులు పడిన ఇబ్బందులను వినతుల రూపంలో స్వీకరించారు. ఆ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.