TPT: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 21న తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. అయితే రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి 20న తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు. కాగా, 21న శ్రీ వరాహస్వామి ఆలయాన్ని, అనంతరం శ్రీవారి ఆలయాన్ని దర్శించనున్నారు. దీంతో ఏర్పాట్లపై TTD అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.