KRNL: ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు సుంకేసుల డ్యాంకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 9,155 క్యూసెక్కులుగా ఉంది. 2 గేట్లు ఎత్తి 6,710 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని శుక్రవారం అధికారులు తెలిపారు. కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు.