KDP: మండలంలోని టక్కోలు గ్రామ సచివాలయంలో గురువారం జరిగిన గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశం పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. ఇటీవల నూతన సర్పంచిగా లక్ష్మీదేవి ఎన్నిక కాగా మొదటిసారిగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.