CTR: చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బోయకొండ గంగమ్మ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఏకాంబరం అర్చకులు భక్తులు పాల్గొన్నారు.