NDL: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టడానికి చేరింది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి 2,22,285 క్యూసెక్కుల నీరొచ్చి చేరింది. డ్యాం నాలుగు గేట్లు, రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 1,79,682క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.