VZM: కార్మిక వర్గ శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా ఏఐటీయూసీ 105 ఏళ్ళగా నిర్విరామ పోరాటాలు చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ తెలియచేశారు. ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం విజయనగరంలో జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబాయి నగరంలో ఆవిర్భవించిందన్నారు.