ELR: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగిన తరువాతే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నేత విస్సంపల్లి సిద్దు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జంగారెడ్డిగూడెంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్రాలు వర్గీకరణ చేయకుండా మాదిగల పట్ల వివక్ష చూపడం సరికాదని తెలిపారు. వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు.