సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని మంచేపల్లి, పందిపర్తి, ఈదులబల్లాపురం గ్రామ చెరువులకు సంబంధించిన పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ మంగళవారం రాత్రి తెలిపారు. హెచ్. ఎస్. ఎస్. ఎస్. కాలువకు గండి పడిన కారణంగా, వర్షపు నీరు పై గ్రామాల్లోని చెరువులను నింపి పెనుకొండ మండలంలోని నాగలూరు చెరువుకు చేరవచ్చునని ఆయన చెప్పారు. ఈ మేరకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.