సత్యసాయి: రాష్ట్ర స్థాయి అండర్ 17 వాలీబాల్ పోటీలకు గోరంట్ల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి రోహిత్ కుమార్ ఎంపిక అయినట్లు ప్రదానోపాధ్యాయులు గోపాల్ తెలిపారు. సోమవారం నుండి ముద్దిరెడ్డి పల్లి మున్సిపల్ పాఠశాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడా పోటీలకు ఎంపిక అయిన విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.