అనంతపురం: గుల్జార్ పేట్‌కు చెందిన షేక్ తుమ్మలకుంట మతీన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇన్సూరెన్స్ విషయంలో ఉన్న సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.