కృష్ణ: ముదినేపల్లి మండలం వాడవల్లిలో శనివారం శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా విజయదశమి పురస్కరించుకొని గ్రామస్థులు ఏర్పాటు చేసిన శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.