చిత్తూరు: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని సీఐ శ్రీనివాసులు, ఎస్సై కొండారెడ్డి అన్నారు. పోరుమామిళ్ల పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు పలు వాహనాలను రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు గుర్తించి ఫైన్ వేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని వారికి సూచించారు.