కోనసీమ: మండల కేంద్రమైన ఆలమూరులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజల సమస్యలను విని వారి నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని ఆదేశించారు.