BPT: ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లెలో సోమవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.