ELR: భీమడోలు సామాజిక ఆరోగ్యకేంద్రం ఆవరణలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సీహెచ్సీ సూపరింటెండెంట్ డా.సునీత ప్రారంభించారు. నాగహనుమాన్ ఫ్యాక్టరీ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో కంటి వైద్య నిపుణులు పాల్గొని 95 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఐడ్రాప్స్, మాత్రలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యనిపుణులు సీహెచ్వో ఇందిరా, పీఎంవో వెంకటరెడ్డి, దివ్య పాల్గొన్నారు.