ASR: పిఎం జన్ మన్ పథకంలో మంజూరైన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ డీఈ రాజుబాబు లబ్ధిదారులకు సూచించారు. హుకుంపేట మండలం తీగల వలస పంచాయితీలో పలు గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం గుర్రాలతోట గ్రామంలో పిఎం జన్ మన్ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. ఇళ్లుకు మూడు దఫాలుగా బిల్లులు మంజూరవుతాయని డీఈ తెలిపారు. మండల ఏఈ ఈశ్వరీ ఉన్నారు.