నెల్లూరు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అరుదైన ఘనత దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ కమిటీ ఆన్ ఫైనాన్స్ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ ఈ మేరకు శుక్రవారం బులెటిన్ విడుదల అయింది. పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభ నుంచి సభ్యులను ఇందుకు ఎంపిక చేశారు.