KNL: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కప్పట్రాళ్ల ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు. యురేనియం కోసం 68 బోర్లు వేయడానికి అధికారులు సిద్ధమయ్యారని అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలను అడ్డుకోవాలని చూడటం తగదని హెచ్చరించారు.