కర్నూలు నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీ అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ (పురుషుల) కళాశాలలో ఈనెల 21 అనగా సోమవారం 2024-25 అడ్మిషన్స్ పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు NCC ఎలక్షన్స్ నిర్వహించినట్లు LT.R కామ్లా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ స్టాఫ్ పాల్గొంటారని చెప్పారు. తప్పనిసరిగా మొదటి సంవత్సరం విద్యార్థులు హాజరు కావాలని కోరారు.