NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్‌కు చెప్పొచ్చని పేర్కొన్నారు.