PLD: మాచవరం మండలం చెన్నాయపాలెంలోని సరస్వతి ఇండస్ట్రియల్ భూములను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నట్లు తహశీల్దార్ క్షమారాణి మంగళవారం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని సుమారు 1000 ఎకరాల వరకు రైతుల వద్ద నుంచి భూములు సేకరించిన విషయం విదితమే.