TPT: వెంకటగిరిలో వికలాంగుడైన సచివాలయ ఉద్యోగి సాయి కుమార్‌పై దాడికి పాల్పడ్డ కౌన్సిలర్ శేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి కోరారు. ఆ మేరకు ఆయన కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఉద్యోగులపై దాడికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు.