VZM: గుర్ల మండలంలోని పకీరు గిత్తలి, దేవుని కనపాక గ్రామ శివార్లలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లపు ఊటతో పాటు 30 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసినట్లు ఎస్సై రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు సుదర్శన్ కుమార్, రాంబాబు పాల్గొన్నారు.