కృష్ణ: కనక దుర్గమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని టీడీపీ ఉపాధ్యక్షుడు వైవీబీ. రాజేంద్ర ప్రసాద్ కోరారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఉయ్యూరు మండలం, కాటురు గ్రామంలో నేరుసు పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో రాజేంద్ర ప్రసాద్ పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు.