NLR: సూళ్లూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం చెత్త మయంగా మారింది. దీపావళి సందర్భంగా టపాసుల షాపులు పెట్టడంతో నిర్వాహకులు ఎక్కడి చెత్తను అక్కడే వేసి వెళ్లిపోయారు. విద్యార్థులు ఆడుకోవడానికి, ఉదయాన్నే వాకర్స్ వాకింగ్ చేయడానికి వీలులేకుండా పోయింది. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వాకర్స్ కోరుతున్నారు.