అన్నమయ్య: మదనపల్లె పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్‌కు బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా బొకే అందజేసి, శాలువ కప్పి స్వాగతం పలికారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కలెక్టర్, సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్‌తో తిరిగి సమస్యలను జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్లకు ఎమ్మెల్యే వివరించారు. పట్టణంలో నెలకొన్న అనేక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సహకరించాలన్నారు.