SKLM: టెక్కలి మండలం అయోధ్య పురం పంచాయతీలో వడ్రపేట గ్రామం ప్రస్తుతం దీపావళి గ్రామంగా పిలవబడుతోంది. గత ఏడు దశాబ్దాల క్రిందట వడ్రపేట గ్రామంలో దీపావళి రోజు జరిగిన ఒక దుర్ఘటన కారణంగా ఆ ఊరి పేరు దీపావళిగా మారిందని అక్కడి స్థానికులు చెబుతారు. గార మండలంలో సిక్కోలు రాజు దశాబ్దాల కిందట పర్యటించినప్పుడు దీపావళి అనే పేరుతో ఒక గ్రామానికి నామకరణ చేశారు.