అనంతపురం: బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో మల్లికార్జున అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం డబ్బుల విషయంలో మల్లికార్జున, రఫీ అనే వ్యక్తి మధ్య గొడవ జరగగా.. పెద్దమనుషుల మధ్య రాజీ జరుగుతుండగా మల్లికార్జున కుప్ప కూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.