VZM: పార్వతీపురం నుంచి పాలకొండ రోడ్డు అధ్వానంగా ఉంది. అడ్డాపుశీల, ఎర్రన్న గుడి తదితర ప్రాంతాల్లో గోతులతో నిండి ఉంది. దీంతో ఈ రహదారిపై ప్రయాణం.. నరకప్రాయంగా ఉందని వాహన చోదకులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈఏ గుంతలో పడి ప్రమాదం కొని తెచ్చుకుంటారన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గోతులను పూడ్చాలని కోరుతున్నారు.