VSP: విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభంపై స్పష్టత కొరవడింది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) రూ.21 కోట్లతో భవనాల నిర్మాణమైతే పూర్తిచేశారు. కానీ ఏడాది దాటుతున్నా ఇప్పటికీ ప్రారంభించలేదు. పరికరాలు కొనుగోలు ప్రక్రియ కూడా ఇంకా పూర్తికాలేదని వాపోతున్నారు.