ELR: కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉండేలా తీర్చిదిద్దుతానని అన్నారు.