పల్నాడు: నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్ను గురువారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనలు గురించి అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను తనిఖీ చేసి తగు సలహాలు చేశారు. స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పర్యవేక్షించి కేసులను పూర్తి చేయాలని సీఐ రామకృష్ణ, ఎస్సై కిషోర్లకు సూచించారు.