KRNL: పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో సభ్య సమాజం తలదించుకునేలా దాడికి గురై కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత మహిళ గోవిందమ్మను సోమవారం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ బిందు మాధవ్ పరామర్శించారు. సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించారా, మెరుగైన వైద్యం అందుతుందా అని ఆమెను అడిగారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.