అనంతపురం: గుత్తి మున్సిపాలిటీ పరిధిలో దుకాణాదారులు ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పు అని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా షాపు యజమానులకు హెచ్చరించారు. ఆయన పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద దుకాణాలను తనిఖీ చేశారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక దుకాణానికి రూ.15,000 జరిమానా విధిస్తూ షాపును సీజ్ చేశారు.