కొన్ని సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతం చేస్తుంటాయి. ఇప్పటికే కాంతార, లవ్ టుడే లాంటి డబ్బింగ్ సినిమాలు తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఇక పోయిన వారం రిలీజ్ అయిన మళయాళ బ్లాక్ బస్టర్ 2018 కూడా అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.
ఆదిపురుష్ ప్రీ రీలిజ్ ఈవెంట్ ఈ నెల 6వ తేదీన తిరుపతిలో జరగనుంది. ఆ వేడుకకు ముంబై నుంచి తిరుపతికి బండి మీద వస్తానని సంగీత దర్శకుడు అజయ్ అతుల్ ప్రకటించారు.
క్యాన్సర్(Cancer)పై అవగాహన లేకపోయుంటే, తాను నిర్లక్ష్యంగా ఉండుంటే ఒకటి రెండేళ్ల తర్వాత తన పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదని, అవగాహన ఉండడంతో ఆసుపత్రి(Hospital)కి వెళ్లి చికిత్స తీసుకున్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ ఉన్న సంగతి చెప్పేందుకు భయపడటం లేదని, తన ఫ్యాన్స్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు.
హీరో విశ్వక్ సేన్(Hero Viswaksen) చేతుల మీదుగా 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో'(Annapoorna Photo Studio Movie) నుంచి నాలుగో సాంగ్ రిలీజ్ అయ్యింది. 'ఓ ముద్దుగుమ్మ' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్(Romantic Song) అందర్నీ ఆకట్టుకుంటోంది.
దగ్గుబాటి అభిరామ్ తెరంగ్రేటం చేసిన అహింస మూవీకి నెగిటివ్ టాక్ వస్తోంది. దీంతో డైరెక్టర్ తేజ తదుపరి మూవీ రాక్షస రాజుపై ప్రభావం పడింది. రానాతో చేసే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లడం కష్టమేనని ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడంతో.. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు ఇద్దరు. అంతేకాదు ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఇచ్చిన లీకేజీ మాత్రం అదిరిపోయేలా ఉంది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) వేళ హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. వెంటనే తప్పు తెలుసుకుని ఆ ట్వీట్ ను డిలీట్ (Delete) చేయగా అప్పటికే నెటిజన్లు రాహుల్ పై మండిపడ్డారు. తాను చేసిన దానికి రాహుల్ క్షమాపణలు (Apologise) చెప్పాడు. ‘ఒట్టేసి చెబుతున్నా’ ‘క్షమించండి’ అని పలు ట్వీట్లు చేయడంతో నెటిజన్లు శాంతించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..? చదవండ...
అసలు రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో.. ఒకసారి లైగర్ ప్రమోషన్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. జస్ట్ తెలుగులో మాత్రమే ఫాలోయింగ్ ఉన్న విజయ్.. లైగర్ రిలీజ్‌కు ముందే పాన్ ఇండియా లెవల్లో ఇండియాను షేక్ చేశాడు. కానీ లైగర్ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఒకవేళ లైగర్ హిట్ అయి ఉంటే.. రౌడీ ఇప్పుడు వంద కోట్ల హీరో. కానీ ఇప్పుడు విజయ్ రెమ్యూనరేషన్ ఘోరంగా పడిపోయినట్టు తెలుస్తోంది.
హీరోయిన్ అవికా గోర్ నటించిన '1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్'(1920 Horror Of The Heart) అనే మూవీకి సంబంధించి మేకర్స్ ట్రైలర్ రిలీజ్(Trailer Release) చేశారు. ఈ సినిమాతో అవికా బాలీవుడ్ లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 16వ తేదీన విడుదల చేస్తామని సినిమా బృందం చెబుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ సినిమాపై వివాదాలు మొదలవుతున్నాయి.
ఒడిశా ప్రమాద మృతులకు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని.. రక్తదానం చేయాలని అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు.
‘ఇలాంటిది గతంలో ఎప్పుడూ తినలేదు’ అని పోస్టు చేశాడు. స్వయంపాకం అద్భుతంగా వచ్చిందని వరుణ్ తెలిపాడు. వంటలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్ద బెస్ట్ బ్రో.. పెళ్లయ్యాక మనమే వంటలు చేయాలి మరిందరు కామెంట్ చేస్తున్నారు.
దుల్కర్ సల్మాన్‌తో నటుడు రానా ఓ మూవీ నిర్మిస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలో రానుంది.
ఒకప్పుడు ఏమో గానీ.. ఇప్పుడు మాత్రం టాలీవుడ్‌ని చూస్తే భయపడిపోతుంది బాలీవుడ్. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయింది టాలీవుడ్. ముఖ్యంగా హిందీ జనం మన సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అప్ కమింగ్ సినిమాల్లో ఓ రెండు ప్రాజెక్ట్స్ మాత్రం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు చెమటలు పట్టిస్తున్నాయి.
నాగచైతన్య తదుపరి సినిమాలో మత్స్యకారుడి రోల్ పోషించనున్నారు. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.