మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సాలిడ్ ట్రీట్ రాబోతోందంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే.. ఇప్పుడు మాత్రం సౌండ్ తగ్గిపోయినట్టే కనిపిస్తోంది. పవన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. హరిహర వీరమల్లు టీజర్ ని రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తామన్నారు. అయితే జనవరి 26 దగ్గర పడుతున్నా.. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అసలు హరిహర వీరమల్లు టీజర్ ఉందా లేదా.. అనే డైలమాలో పడిపోయారు అభిమానులు.
దీనికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అమెరికాలో ఉండటమే.. ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆయన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అమెరికా టూర్లోనే ఉన్నారు. దీంతో ఇప్పటికిప్పుడు హరిహర వీరమల్లు టీజర్ రెడీ అయ్యే ఛాన్సెస్ తక్కువ అంటున్నారు. కాబట్టి టీజర్‌ని 26న రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదు. అయితే జనవరి 26కి ఇంకా టైం ఉంది కాబట్టి.. డైరెక్టర్ క్రిష్ ఇంకేమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి. ఇకపోతే.. పవర్ స్టార్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో.. వీరమల్లు పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. క్రిష్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరెక్కిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. మరి పాన్ ఇండియా స్థాయిలో పవర్ స్టార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.