»Another Case Against Nayanthara Vignesh Sivan Couple
Nayantara-vignes: నయనతార – విఘ్నేశ్ శివన్ దంపతులపై మరో కేసు!
స్టార్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్లపై మరో కేసు నమోదైంది. విఘ్నేశ్ శివన్ కుటుంబీకులు ఆ దంపతులపై కేసు పెట్టారు. దీంతో మరోసారి నయన్ విఘ్నేశ్ దంపతులు వార్తల్లో నిలిచారు.
లేడీ స్టార్ హీరోయిన్ నయనతార(Nayantara), దర్శకుడు విఘ్నేశ్ శివన్(Vignesh shivan)లు పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆస్తి వివాదానికి సంబంధించి విఘ్నేశ్ శివన్ బాబాయిలు పోలీసులను ఆశ్రయించారు. తమ ఫిర్యాదులో నయనతార పేరును కూడా నమోదు చేశారు. దీంతో ఈ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు.
విఘ్నేశ్ శివన్(Vignesh shivan) తండ్రి శివ కొళుదు(Shiva koludu) స్వస్థలం తమిళనాడులోని తిరుచ్చి జిల్లా. లాల్కుడి గ్రామంలో వారు ఎనిమిది మంది అన్నదమ్ములు. విఘ్నేశ్ తండ్రి కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. తాజాగా ఆయన అమ్మిన ఆస్తి విషయమై ఆయన సోదరులు మాణిక్యం, కుంచిత పాదం పోలీసులను ఆశ్రయించారు.
తమకు తెలియకుండా శివ ఆస్తిని అమ్మాడని డీజీపీ ఆఫీసులో మాణిక్యం, కుంచిత పాదం ఫిర్యాదు చేయగా అందులో నయనతార పేరును కూడా చేర్చారు. పోలీసులు వారి ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపట్టాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇంకా విఘ్నేశ్ శివన్(Vignesh shivan) తల్లి మీనా కుమారి పేరును కూడా చేర్చారు. వీరు ముగ్గురు త్వరలోనే పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.