»Tdp Members Walk Out From Andhra Pradesh Assembly
AP Assembly: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ అబద్దాలను వినలేమంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు.
AP Assembly: ఏపీలో చివరి అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగం మొదలు పెట్టిన కాసేపటికే వైసీపీ ప్రభుత్వం గురించి ఆయన చెబుతున్న అబద్దాలను వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ ఆయన స్పీచ్‌ను వ్యతిరేకిస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని విమర్శించారు. వైసీపీ పాలన అంతా డొల్లా అని, సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందలేదని పేర్కొన్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని, విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై దారుణం అని, ఆయన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కేవలం రాజకీయ లబ్దికోసమే అని అన్నారు. మెగా డిఎస్సీ కాదు అది దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.