Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని విజయ్ అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయమని, ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వమని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని విజయ్ తెలిపారు. విజయ్ మక్కల్ ఇయక్కం(అభిమానుల సంఘం) నిర్వాహకులతో విజయ్ ఇటీవలే నాలుగుసార్లు సమావేశమయ్యారు. తాజాగా చెన్నై శివారు పనైయూర్లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండాలపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ పేరుపై ఆయన ఎక్కువసేపు నిర్వాహకులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారట.
తమిళ సూపర్ స్టార్ తర్వాత అంతటి స్టార్ డమ్ వచ్చింది విజయ్‌కే. అయితే దళపతికి ఆస్థాయి స్టార్డమ్ రావడం వెనుక తెలుగుచిత్రాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ కెరీర్లో పోక్కిరి, గిల్లి, బద్రి, ఆది, వేలాయుధం, యూత్ వంటి సినిమాలు ముఖ్యమైనవి. కెరీర్‌ను మలుపుతిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. పవన్‌కల్యాణ్‌ను ఎక్కువగా అనుకరించేవారు. ఆయన పాటలు, సినిమాలను రీమేక్ చేశారు. తమిళంలో అభిమానులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏడాదిలో రెండుసార్లు నేరుగా సమావేశమై వారికి బిర్యానీ వడ్డించడం, బహుమతులు ఇవ్వడం చేస్తున్నారు.