Budget 2024: మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) ఆదాయపు పన్ను(Income Tax)లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ తాత్కాలిక బడ్జెట్లో పన్ను విధానాల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఆదాయపు పన్ను ( Income tax) లో రూ.7లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదని అన్నారు. అయితే ప్రత్యక్ష పన్నులో కొన్ని మార్పులు కనిపించాయి. కొత్తగా తీసుకొచ్చిన విధానంలో కోటి మందికి పైగా లబ్ది పొందుతున్నట్లు నిర్మాలా సీతారామన్ పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రత్యక్ష పన్ను నోటిసులు అందుకున్న వారిలో 2009-10 మధ్య రూ. 25 వేలు, 2010-11, 2014-15 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ. 10 వేల వరకు అందుకున్న నోటీసులకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ప్రభుత్వానికి రూ.26.02 లక్షల కోట్లు పన్నులు ఆదాయంగా వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. ఇక కార్పొరేట్ పన్ను విధానంలో ఇప్పటి వరకు కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం ఉండగా, దాన్ని 22 శాతానికి తగ్గించారు. ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయి. అయితే పరోక్ష పన్నుల్లో పెద్దగా మార్పు లేదని తెలిపారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ ఆదాయం రూ.30.08 లక్షల కోట్లు వచ్చిందిని, అలాగే ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉందని, ఈ సంవత్సరం అప్పులు రూ. 14 లక్షల కోట్లు ఉందని కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ వెల్లడించారు.