NTR and Pawan Kalyan: బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్న పవన్, ఎన్టీఆర్..!
ప్రతివారం ఎన్ని సినిమాలు విడుదలైనా స్టార్ హీరో సినిమా ఇచ్చే కిక్కు మరే సినిమా ఇవ్వదనే చెప్పాలి. ఒక్క స్టార్ హీరో సినిమా వస్తేనే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. మరి ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి వస్తుంటే.. వారి ఫైట్ మరి ఎంత ఆసక్తిగా ఉంటుందో స్పెషల్‌గా చెప్పాలా.. అదే జరగబోతోంది. పవన్, ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీసు వద్ద తలపడనున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం OG కూడా క్రేజీ ప్రాజెక్ట్. ఇప్పుడు, రెండు చిత్రాల విడుదలతో తాజా పరిణామాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి రెడీ అవుతున్నాయి. భారతదేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
మరో వైపు ఎన్టీఆర్ నటించిన దేవర కూడా భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాలో బ్లడీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇండియన్ సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేవని అంటున్నారు. గ్లోబల్ ఫినామినాన్ RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్నసినిమా ఇది. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ పెండింగ్‌లో ఉన్నందున అక్టోబర్‌లో విడుదల చేయాలని టీమ్ చూస్తున్నారు.
ఈ రెండు సినిమాల మధ్య కేవలం 2 వారాల గ్యాప్ మాత్రమే ఉంటుంది . ఈ స్టార్ హీరోలిద్దరూ ఒకే సమయంలో విడుదల చేస్తే పెద్ద క్లాష్ జరిగే అవకాశం ఉంది. 2013లో పవన్ అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా రెండు వారాల గ్యాప్‌తో విడుదలయ్యాయి. అప్పుడు అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ కాగా, రామయ్య వస్తావయ్య ప్లాప్ గా నిలిచింది. మరి ఈ సారి ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.