Mayank Agarwal: భారత స్టార్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. త్రిపురలో మ్యాచ్ గెలిచిన తర్వాత సూరత్‌కు విమానంలో పయనమయ్యాడు. కూర్చున్న సీటు ముందు ప్లాస్టిక్ కవర్లో ఉన్న హానికారక ద్రవాన్ని నీళ్లు అనుకుని తాగాడు. దీంతో అతని నోట్లో ఇబ్బంది మొదలైంది. నోరు వాచిపోయి బొబ్బలు వచ్చాయి. అసలు మాట్లాడలేకపోయాడు. సిబ్బంది వెంటనే విమానాన్ని ఆపి మయాంక్‌ను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతనిని ఐసీయూలో ఉంచారు.
ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అతనికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. మయాంక్ చివరగా త్రిపురతో రంజీ మ్యాచ్‌లో ఆడాడు. ఫిబ్రవరి 2న జరిగే మ్యాచ్‌కు మయాంక్ దూరమయ్యాడు. అతని స్థానంలో నిఖిన్ జోస్ కర్ణాటకు సారథ్యం వహించనున్నాడు.