సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇటీవల జరిగిన బహుజన్ సమాజ్ హక్కుల సదస్సును ఉద్దేశించి మౌర్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Swami Prasad Maurya: హిందుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన బహుజన్ సమాజ్ హక్కుల సదస్సును ఉద్దేశించి మౌర్య మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ మతం మోసపూరితమని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం మోసం వంటిదని, అసలు హిందూ మతమే లేదని.. అది కేవలం ఓ జీవన విధానమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చాలాసార్లు చెప్పారని తెలిపారు. హిందూమతం లేదని ప్రధాని నరేంద్రమోదీ కూడా చాలాసార్లు చెప్పారని మౌర్య పేర్కొన్నారు.
ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినవని.. అదే స్వామి ప్రసాద్ మౌర్య మాత్రం ఇలాంటి ప్రకటనలు చేస్తే అలజడి అవుతుందన్నారు. మౌర్య వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ మతం, కులంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని మౌర్యకు సూచించారు. గతంలో కూడా మౌర్య ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కొంతమంది బ్రాహ్మణ నేతలు అఖిలేష్‌కు ఫిర్యాదు చేయడంతో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సహించేది లేదని స్పష్టం చేశారు.