»Congress Mla Rajagopal Reddy And Brs Mla Harish Rao Exchange Of Words
Harish-Rajagopal మధ్య మాటల యుద్ధం.. దద్దరిల్లిన అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. రూ.50 కోట్లు అని హరీశ్ రావు కామెంట్స్ చేశారు.
Congress Mla Rajagopal Reddy And BRS Mla Harish Rao Exchange Of Words
Rajagopal Reddy-Harish Rao: తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్‌గా కొనసాగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. అసెంబ్లీలో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ జరిగింది. ఒకరికొకరు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతప్రతం విడుదల చేసింది. చర్చ సమయంలో రాజగోపాల్ రెడ్డి- హరీశ్ రావు మధ్య వాగ్వివాదం జరిగింది. మంత్రి హరీశ్ గురించి రాజగోపాల్ ప్రస్తావించారు. ఎంత అరిచిన తనకు మంత్రి పదవీ ఇవ్వరని హరీశ్ అన్నారు. హరీశ్‌కు ఎంత బాగా పనిచేసిన సీఎం పదవీని కేసీఆర్ ఇవ్వరని చెప్పారు. రాజగోపాల్ కామెంట్లపై హరీశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ వెంటనే మాట్లాడుతూ.. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవీ కొనుక్కోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పోస్ట్‌ను కొనుక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనను ఉద్దేశించి హరీశ్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే.. తాను తీసుకుంటానని హరీశ్ చెప్పారు. రూ.50 కోట్ల కామెంట్లను వెనక్కి తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా కోరారు. అయినా హరీశ్ రావు నో అన్నారు. దీంతో ఆ కామెంట్లను రికార్డుల నుంచి తొలగిస్తున్నానని స్పీకర్ ప్రకటించారు.