Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు స్వల్ప అస్వస్థత!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ్వరం కారణంగా నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. నేడు టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టే యువగళం నవశకం సభకు కూడా పవన్ రాకపోవచ్చని జనసేన వర్గాల సమాచారం.
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నేడు యువగళం-నవశకం (Yuvagalam Navashakam) సభలో పవన్ పాల్గొననున్న తరుణంలో నిన్న రాత్రి ఆయన జ్వరం (Fever) కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అందుకే నేడు సభకు ఆయన ఆలస్యంగా రానున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. మరోవైపు అవస్వస్థ కారణంగా ఆయన యువగళం నవశకం సభకు రాకపోవచ్చని మరికొందరు చెబుతున్నారు.
గత కొంత కాలంలో పవన్ (Pawan Kalyan) తరచూ అస్వస్థతకు గురవుతూ వస్తున్నారు. ఓ వైపు సినిమా షూటింగులల్లో (Shootings) పాల్గొంటూనే మరోవైపు రాజకీయ సభలతో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో పవన్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ అస్వస్థత (Illness)కు గురికావడం వల్ల ఓ సభ, సినిమా షూటింగ్ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా గతంలో పవన్ ఆరోగ్యం (Health) సరిగా లేకపోవడంతో నందమూరి తారకరత్నకు నివాళులు అర్పించేందుకు కూడా వెళ్లలేదని పలు కథనాలు వెలువడ్డాయి. నేడు నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ హాజరు కావాల్సి ఉంది. కానీ అనారోగ్యంతో ఆయన ఆలస్యంగా సభకు వస్తారని జనసేన వర్గాల సమాచారం. పవన్ అస్వస్థతపై ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.