»How Much Did Lionel Messis World Cup Jersey Cost At Auction
Lionel Messi వరల్డ్ కప్‌లో ధరించిన జెర్సీ..వేలంలో ఎంత పలికిందంటే?
ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ గురించి పరియచం అక్కర్లేదు. తన ఆటతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే 2022లో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మెస్సీ ధరించిన జెర్సీ వేలం వేయగా కోట్లు పలికింది.
Lionel Messi: ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఖతార్ గడ్డపై అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. వరల్డ్ కప్ సాధించాలనే తన కలను నిజం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి వరల్డ్ కప్ గెలవాలని కలలు కన్నాడు. ఓటమి లేని తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడుగా మెస్సీకి ఫ్యాన్స్ ఉండటంతో పాటు అతని జెర్సీకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. 2022 వరల్డ్ కప్‌లో మెస్సీ ధరించిన ఆరు 10 నెంబరు జెర్సీలను అర్జెంటీనాకు చెందిన సోత్‌బైస్ అనే కంపెనీ వేలం వేసింది.
ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో మెస్సీ ధరించిన జెర్సీతో పాటు ఆ టోర్నీల్లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలకు ఆ కంపెనీ రూ. 76 కోట్లు కనీస ధర నిర్ణయించింది. కానీ ఆరు జెర్సీలకు కలిపి రూ.64 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ జెర్సీ వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంత డబ్బును అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల చికిత్సకు విరాళంగా ఇవ్వనున్నట్లు మెస్సీ వెల్లడించారు.
గతేడాది ఖతర్‌లోని లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మెస్సీ రెండు గోల్స్‌తో అర్జెంటీనాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేలా కీలకపాత్ర పోషించాడు. మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. కేవలం అర్జెంటీనా కల మాత్రమే కాదు.. వరల్డ్ కప్ సాధించాలనే 35ఏళ్ల మెస్సీ కల కూడా నెరవేరింది. అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు ప్రతిష్ఠాత్మక బాలన్ డీ ఓర్ అనే అవార్డు మెస్సీని ఎనిమిదోసారి వరించింది.