Dhruva Natchathiram first review: ధృవ నక్షత్రం ఫస్ట్ రివ్యూ!
డైరెక్టర్ గౌతమ్ మీనన్, హీరో చియాన్ విక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ధృవ నక్షత్రం విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో సినిమా ఫైనల్ కట్ చూసిన దర్శకుడు లింగుసామి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. దీంతో చియాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Dhruva Natchathiram first review: దాదాపు ఆరేళ్ల పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొన్న హీరో చియాన్ విక్రమ్(Chian Vikram), దర్శకుడు గౌతమ్ మీనన్(Gautham Menon)ల చిత్రం ధృవ నక్షత్రం(Dhruva Natchathiram) ఎట్టకేలకు నవంబర్ 24న గ్రాండ్ రిలీజ్‌తో వెండితెరను అలంకరించేందుకు సిద్ధంగా ఉంది. 2017లో తన షూటింగ్ ప్రారంభించిన ఈ మూవీ పలు వివాదాలు ఎదుర్కొంది. దీన్ని విడుదల చేయడానికి దర్శకుడు మీనన్ చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవి విజయవంతం అవలేదు. ప్రస్తుతం దీనికోసం ప్రేక్షకులు ఆత్రంగా చూస్తున్నారు. ఈ మేరకు ముంబైలో ఫైనల్ కట్ చూసిన సూపర్ హిట్ డైరెక్టర్ లింగుసామి సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఎక్స్ వేదికగా లింగుసామి(Lingusami) స్పందిస్తూ.. ముంబయిలో ధృవ నక్షత్రం ఫైనల్ కట్ని చూశానని, సినిమా చాలా అద్భుతంగా ఉంది. చక్కగా రూపొందించారు. చాలా మంచి విజువల్స్‌తో ప్రేక్షకులు అబ్బురపడేలా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా హీరో చియాన్ విక్రమ్ గురించి రాసుకొచ్చారు. చియాన్ కూల్‌గా ఉండు సినిమాలో నీ నటనకు అభిమానులు ఎంతో సంతోషిస్తారు.
అలాగే ఈ మూవీలో నటించిన భారీ నటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరూ అద్భుతంగా నటించారని తెలిపారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. ధృవ నక్షత్రం సినిమా భారీ ఓపనింగ్స్తో బాక్స్ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ధృవనక్షత్రం చిత్రం గౌతమ్ వాసుదేవ్ మీనన్ గూఢచారి యాక్షన్ చిత్రం. ఇందులో చియాన్ విక్రమ్, రీతూ వర్మ, ఆర్ పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినయన్లతో పాటు తదితరులు నటించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించగా, ఆంథోని ఎడిటర్‌గా పనిచేశారు. సినిమాటోగ్రాఫర్‌గా మనోజ్ పరమహంస వర్క్ చేశారు.