Xiaomi 14 Pro: అద్భుత ఫీచర్లతో షావోమీ కొత్త ఫోన్ లాంచ్.. ధరెంతో తెలుసా?
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా 14 సిరీస్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులోకి వస్తుండగా, భారత మార్కెట్లోకి కొత్త ఫోన్లు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటన రావాల్సి ఉంది. దీని ఫీచర్లు ఒకసారి చూద్దాం.
Xiaomi 14 Pro: మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్(Smart phones) ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. వాటన్నింటికి పోటీ ఇచ్చేందుకు చైనా దిగ్గజం షావోమీ(Xiaomi) తాజాగా 14 సిరీస్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. షావోమీ 14(Xiaomi 14), షావోమీ 14 ప్రో(Xiaomi 14 Pro) పేర్లతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులోకి వస్తుండగా, భారత మార్కెట్లోకి కొత్త ఫోన్లు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటన రావాల్సి ఉంది. దీని ఫీచర్లు ఒక్కసారి చూద్దాం.
ఈ స్మార్ట్ ఫోన్స్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంది. ఇది హైపర్ ఓఎస్‌తో పని చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 6.36 ఇంచెస్‌తో కూడిన ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లేతో లభిస్తోంది. 2కే రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ ఉంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలోనూ 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉన్నాయి. షావోమీ 14, 14 ప్రో ఫోన్స్ ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉన్నాయి. షావోమీ 14 ప్రో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 56,500గా ఉంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ వేరియంట్ ధర రూ. 68,200గా నిర్ణయించారు. ఇక 16 జీబీ ర్యామ్, 1 టీబీ వేరియంట్ ధర రూ. 74,000గా ఉంది. ఇక షావోమీ 14 ప్రోలో 6.73 ఇంచెస్‌తో కూడిన డిస్ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్‌తో కూడిన ట్రిపుల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్లో 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4610 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే 50 వాట్స్ వైర్‌లైస్ ఛార్జింగ్, 10 వాట్స్ వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. అలాగే యూఎస్బీ 3.2 పోర్ట్, బ్లూటూత్, జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, నావిక్, టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లతో పాటు డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి.